*సీసీఐ కొనుగోలు నిరాకరణతో వాంకిడి రైతుల రాస్తారోకో*
*అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-*
కొమరం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని చెకోపోస్ట్ వద్ద
జిన్నింగ్ యార్డు సమీపంలో సుమారు 150 మంది రైతులు పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాస్తారోకో నిర్వహించారు సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడానికి నిరాకరించడంతో ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు సంఘటనా స్థలంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్ఐ రైతులతో సీసీఐ అధికారులతో చర్చలు జరుపుతున్నారు