సమాజంలో నేరం చేసిన ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకొలేరు. - కె. వినోద్ రావు. పబ్లిక్ ప్రాసిక్యూటర్. నిర్మల్ జిల్లా కోర్టు.
అక్షరవిజేత
మామడ:ఫోక్సో కేసులో ఒకరికి 20 సంవత్సరాల కారాగార శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధించిన జిల్లా జడ్జి శ్రీవాణి.
ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. వినోద్ రావు మాట్లాడుతూ...
సమాజంలో నేరం చేసిన ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకొలేరని తెలిపారు.. ప్రాసిక్యూషన్ వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి ఖచ్చితంగా శిక్ష లు పడేలా చేస్తామని తెలిపారు. న్యాయస్థానాల ద్వారా శిక్షలు పడటానికి తగిన సాక్షులను న్యాయస్థానాలలో ప్రవేశపెట్టటానికి నిందితుడి శిక్ష పడడంలో కృషిచేసిన విచారణ అధికారులు అప్పటి డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్సై కె. రాజ్ కుమార్,మరియు ఆర్ అనిల్ పి.సి అసిస్టెంట్ ఎల్. ఓ ఆఫీర్లను ప్రత్యేకంగా అభినందించారు.