నేడే స్పటిక లింగ దర్శనం బాలా త్రిపుర సుందరి పీఠంలో భారీ ఏర్పాట్లు
తాడేపల్లిగూడెం (అక్షర విజేత)
పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో: తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం బాలా త్రిపుర సుందరి పీఠంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు, స్పటిక లింగ దర్శనానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 3 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో కొలువైన స్పటిక లింగానికి 12 నదీ జలాల్ నుంచి తీసుకువచ్చిన నీటితో అభిషేకాలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు లింగ దర్శనం కల్పిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి తెలిపారు. శివుడి ఆత్మలింగంగా చెప్పే స్పటిక లింగాన్ని దర్శించడం వల్ల విశేష ఫలితం కలుగుతుందన్నారు. భక్తుల కోరికపై పౌర్ణమికి స్పటిక లింగ దర్శనం ఏర్పాటు చేశామన్నారు. వీటితోపాటు విశ్వేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకం, హోమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భగవన్నామ సంకీర్తనలు జ్యోతిర్లింగ సహిత లక్ష దీపార్చనకు ఏర్పాటు చేశామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద్ వివరణ చేస్తారన్నారు. అన్ని శాఖల అధికారుల సూచనలతో వారి సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసామన్నారు. తాడేపల్లిగూడెం డిపో నుంచి వీరంపాలెం కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిఎం తెలిపారు. ఏర్పాట్లు పీఠం ఈమని శశి కుమార్ శర్మ, సందీప్ శర్మ పర్యవేక్షించారు.