యువత భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది విద్యతో పాటు విలువలు సమాజ సేవతోనే నిజమైన ఇంజనీర్‌గా ఎదగాలి. ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలకు దూరంగా ఉండండి.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగాయపల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఆడిటరియంలో విద్యార్థినీ విద్యార్థులకు మై భారత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్,ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కలిపించారు. అనంతరం మూడు రోజులుగా నిర్వహించిన బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ గెలుపొందిన విద్యార్థి విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ. ఇంజనీరింగ్ విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్మాతలు. టెక్నాలజీతో పాటు మానవతా విలువలను అలవర్చుకోవాలి. ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలు భవిష్యత్తును చెడగొడతాయి. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయడం ద్వారానే మీరు నిజమైన ఇంజనీర్ అవుతారు. వనపర్తి జిల్లాకు మీరు దేశంలో మంచి పేరు తీసుకురావాలని నేను ఆశిస్తున్నానని క్రమశిక్షణతో ముందుకు సాగడం.టెక్నాలజీతో పాటు నీతి, మానవత్వం, బాధ్యత అనే విలువలు మీలో నిండాలి. మీరు భవిష్యత్తు నాయకులు, ఆవిష్కర్తలు, దేశాన్ని ముందుకు నడిపే శక్తి. వనపర్తి యువత దేశానికి దారి చూపేలా నిలవాలి.
మీ ప్రతిభతో వనపర్తి పేరు దేశవ్యాప్తంగా వినిపించండి. కృషి, క్రమశిక్షణ, విలువలతో సాగితే.విజయం తప్పక మీ సొంతమవుతుందని ఎస్పీ తెలిపారు. అనంతరం మూడు రోజులుగా నిర్వహించిన బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్లో గెలుపొందిన విద్యార్థి విద్యార్థులకు జిల్లా ఎస్పీ గారు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ కళాశాల వైస్ ప్రిన్సిపల్, బి.వి.రాం నరేష్ యాదవ్,అసోసియేట్ ప్రొఫెసర్, సిహెచ్ ఆశాజ్యోతి, ప్రోగ్రాం కోఆర్డినేటర్, రాజేందర్ గౌడ్, ప్రోగ్రాం వాలంటరీ, అవినాష్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు