వాన ముసురు చలితో 6 గొర్రెలు, 14 లేత గొర్రె పిల్లలు మృతి ==దాదాపు రెండు లక్షల ఆస్తి నష్టం కలిగిందని కిల్ల రాజు ఆవేదన ==తమను ప్రభుత్వం ఆదుకోవాలని కం
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని కొంకలపల్లి శివారులో గల 14 గొర్రె పిల్లలు 6 గొర్లు తీవ్రంగా కురుస్తున్న వానకు ముసురు, చలికి వాతావరణం అనుకూలించక చనిపోయిన ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గొర్ల కాపరి యజమాని అయిన కిల్ల రాజు వివరాల ప్రకారం తమది నాగర్ కర్నూలు జిల్లా, కోడేరు మండలం, మాచుపల్లి గ్రామం గత మూడు రోజుల నుంచి గొర్రెలు మెప్పుకుంటూ ఇటు రావడం జరిగింది అయితే గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన, ముసురు, చలికి వాతావరణం అనుకూలించక పోవడంతో 14 లేత గొర్రె పిల్లలు అలాగే 6 గొర్రెలు మృతి చెందడం జరిగిందని ఆయన అన్నారు. తమ కండ్ల ముందే మూగజీవాలు కొన ఊపిరితో కొట్టుమిట్టు లాడుతూ చనిపోవడం జరిగిందని ఆయన కంటతడి పెడుతూ బోరుణ విలపించాడు. చనిపోయిన వాటి విలువ దాదాపు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని. తమను ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని గొర్ల కాపరి కిల్ల రాజు వేడుకుంటున్నాడు.