దళితుల ఆత్మగౌరవ మహా ప్రదర్శనకు పిలుపు . సుప్రీం న్యాయమూర్తిపై దాడిని ఖండించిన ఎం.ఆర్.పి.ఎస్., ఎం.ఎస్.పి. నాయకులు
అక్షర విజేత గరిడేపల్లి
సుప్రీం న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నవంబర్ 1న హైదరాబాద్ నగరంలో “దళితుల ఆత్మగౌరవ మహా ప్రదర్శన” నిర్వహించనున్నట్లు ఎం.ఎస్.ఎఫ్. సూర్యాపేట జిల్లా సమన్వయకర్త పందింటి నవీన్ తెలిపారు
ఈ సందర్భంగా గరిడేపల్లి మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎం.ఆర్.పి.ఎస్. మండల అధ్యక్షులు కొత్తపల్లి రవి అధ్యక్షత వహించారు.
రవి మాట్లాడుతూ – దేశ రాజ్యాంగాన్ని కాపాడే అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే దాడి జరగడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు.
సనాతన ధర్మం పేరిట జరుగుతున్న అరాచకాలు రాజ్యాంగ విరుద్ధమని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని ఆయన పేర్కొన్నారు.
దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్‌తో పాటు ప్రేరేపించిన వారిపై కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
నవంబర్ 1న చలో హైదరాబాద్
ఈ దాడి భారత రాజ్యాంగంపైనే కాకుండా దేశంలోని ప్రతి పౌరుడిపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని తెలిపారు.
నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ నగరంలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల దళిత సంఘాలు, ప్రజా సంఘాలు భారీ స్థాయిలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఈ మహా ప్రదర్శన ద్వారా ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు దృష్టి సారించేలా నిర్వహించనున్నామని పిలుపునిచ్చారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్.–ఎం.ఎస్.సి. మండల సమన్వయకర్త కుర్రి వెంకన్న, కళాకారుల సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కోట వీరస్వామి, మండల ప్రచార కార్యదర్శి కడప వీరస్వామి, ఉపాధ్యక్షులు దూరే వినోద్, గారకుంట తండా అధ్యక్షులు బచ్చలకూరి నవీన్, రాజ్ మహమ్మద్, పిట్ట శ్రీను, కాశయ్య, మహేష్, మచ్చ వేణు, పిట్ట నాగరాజు, రాజరత్నం, సిద్దు, నకరికంటి రవి, బచ్చలకూరి నాగార్జున, అలంపల్లి శేఖర్, కొత్తపల్లి పవన్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.