ఉత్తమ ఎస్సైగా ఎంపికైన ములుగు హెచ్ ఓ కి జిల్లా ఎస్పీ అభినందన
అక్షర విజేత,ములుగు జిల్లా ప్రతినిది:
మంగళవారం రోజున నిర్వహించిన నెలవారి సమీక్షలో భాగంగా అత్యుత్తమ సేవలు కనబరిచిన ములుగు ఎస్ హెచ్ ఓ వెంకటేశ్వరరావు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్.పి ఐ పి ఎస్ నగదు రివార్డ్ మరియు ప్రశంసా పత్రం అందించి అభినందించారు. ఉత్తమ ఎస్ఐగా ఎంపికైన ములుగు ఎస్ ఐ ని అడిషనల్ ఎస్పీ శివ ఉపాధ్యాయ , ములుగు డిఎస్పి రవీందర్ , ములుగు సిఐ సురేష్ , మరియు ఇతర అధికారులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.