విద్యుత్ స్తంభం వంగి నెలలు – అధికారులు పట్టించుకోరా?
అక్షర విజేత మెదక్
మెదక్ జిల్లా కేంద్రానికి సమీపంలోని పేరూరు గ్రామం వద్ద దేవాలయానికి వెళ్ళే మార్గంలో నెలలుగా వంగిపోయిన విద్యుత్ స్తంభం రైతులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఆ స్తంభం ఒక రైతు వరి పొలంలో ఉండటంతో, ప్రస్తుతం వరి కోత సీజన్ రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడైనా ఆ స్తంభం పూర్తిగా కూలిపోతుందేమోనని భయపడుతున్నారు.స్థానిక రైతులు చెబుతున్నదాని ప్రకారం, ఈ సమస్యను పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. స్తంభం వంగి ఉండటంతో విద్యుత్ వైర్లు కూడా నేల దగ్గరికి దగ్గరగా వేలాడుతూ ఉండటంతో ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది.రైతులు చెబుతున్నారు “వరి కోసుకోవడానికి ట్రాక్టర్, హార్వెస్టర్ లు రావాలి. కానీ స్తంభం వంగి ఉండడంతో పోలంలోకి యంత్రాలు వెళ్ళడం కష్టమవుతోంది. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యుత్ శాఖ అధికారులను వెంటనే స్పందించి ఆ స్తంభాన్ని నిలువుగా చేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.