అధికారులు అప్రమత్తంగా ఉండాలి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం (అక్షర విజేత) పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో : రాష్ట్రానికి పొంచి ఉన్న తుఫాను ముప్పు నేపథ్యంలో నియోజకవర్గంలోని అధికారం అందరూ అప్రమత్తంగా ఉండాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశించారు. మండలంలోని నందమూరు అక్విడిట్ ను ఆయన శనివారం పరిశీలించారు. ఎర్ర కాలువ పరిస్థితి పై అధికారులను ఆరా తీశారు. వాతావరణ పరిస్థితులు ఎల్లవేళలా ఒకే విధంగా ఉండమని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ ప్రభావం వర్షపాతం అధికంగా ఉన్న ప్రాంతాలను అధికారులు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలపై ఎల్లవేళలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితిలో తాడేపల్లి గూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను ప్రజలు సంప్రదించాలా అధికారులు వారిలో అవగాహన కల్పించాలన్నారు. నందమూరి లో రైతులతో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలలోనీ రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూటమి నాయకులు స్వచ్ఛందంగా ప్రజలందరికీ సహాయపడాలని ఆయన కోరారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ నిర్వహించి రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ ఏఈ రమేష్ బాబు, డీకే ధర్మజ్యోతి, ఎమ్మార్వో సునీల్ కుమార్, కడప ప్రసాద్, చెరుకూరి సోమశేఖర్, మద్దిపాటి ధర్మేంద్ర, వట్టికూటి వెంకటేశ్వరరావు, శనగల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.