మేధో తుఫానుపై మున్సిపల్ కమిషనర్ పీ శ్రీహరిబాబు సమీక్ష సమావేశం తుఫాన్ సన్నద్ధతపై అధికారులకు ఆదేశాలు
చిలకలూరిపేట అక్షర విజేత
పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం నాడు మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు మేధో తుఫానుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొంథా తుఫాను ప్రభావంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.తుఫాన్ ప్రభావంతో ప్రజల నుంచి వచ్చే సమస్యలను స్వీకరించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, ముందస్తు సమాచారం అందేలా చూడాలని సూచించారు.రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేందుకు అవసరమైన యంత్రాలను అందుబాటులో ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. అంతేకాకుండా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని పీ. శ్రీహరిబాబు అధికారులను ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ డీఈఈ అబ్దుల్ రహీం, మేనేజర్ మొహిద్దిన్, శానిటరీ ఇనస్పెక్టర్లు సిహెచ్ రమణారావు, సునీత, ఏఈలు మణి, అల్తాఫ్, అన్సారీ, టౌన్ ప్లానింగ్ అధికారులు వెంకటేశ్వర్లు, బి. రాజేష్, షేక్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.