ఊరురా, దండారి సంబరాలలో రాజ్ గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు న్యాయవాది పంద్రం శంకర్.
అక్షర విజేత:అదిలాబాద్ జిల్లా బ్యూరో.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని కొత్తపల్లి, రెండ్లపల్లి, పట్నాపూర్, మేడిగూడ, దీప్ గూడా, గ్రామాలలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు, ఆ గ్రామాలలో పర్యటించి,దండారి ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా న్యాయవాది పంద్రం శంకర్ మాట్లాడుతూ, ఆదివాసీ గ్రామాలలో ఆనాటి ఆచార సంప్రదాయలను, పాటిస్తూ, భవిత రాలకు సంస్కృతి, సంప్రదాయలను ,అందించ వలసిన బాధ్యత అందరిపై ఉందని ఏ అవసరం ఉన్న ఆదివాసుల సమస్య ల పరిష్కారనికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్ గోండ్ సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షులు రామేల్లి భోజన్న, మండల అధ్యక్షులు కనక అమృత్ రావ్, ఆత్రం మోహన్, మాడవి కృష్ణ ,మాడవి మనోహర్, తోడషం గోపాల్, నిలకాంత్ రావ్, పటేల్, ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు, పాల్గొన్నారు.