కూటమి నాయకులు- వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ
అక్షరవిజేత, కుక్కునూరు :
సూపర్ జి యస్ టి - సూపర్ సేవింగ్స్ కు సంబంధించి వారోత్సవాలలో భాగంగా వ్యవసాయ శాఖ - కూటమి నాయకుల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ముందుగా ట్రాక్టర్ లను ర్యాలీ గా మండల టీడీపీ అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరావు ఇంటి నుండి పాత కుక్కునూరు గ్రామ సచివాయలం వరకు అక్కడి నుండి రామాలయం వరకు ర్యాలీ గా వెళ్ళి, ర్యాలీ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన , జిల్లా వ్యవసాయ శాఖాధికారి షేక్ హబీబ్ భాషా వారిని కలిసి, అక్కడి నుండి ర్యాలీ గా కుక్కునూరు మండల కేంద్రానికి ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖాధికారి వారు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ గా వచ్చి ఉన్నారు. ర్యాలీ లో జిల్లా వ్యవసాయ శాఖాధికారి వారు మాట్లాడుతూ ఈ సూపర్ జి యస్ టి - సూపర్ సేవింగ్స్ ద్వారా జీఎస్టీ తగ్గింపు అనేది రైతుకి చేయూత - దేశ ప్రగతికి బాట అని, ట్రాక్టర్ లు, వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ 12 శాతం నుండి శాతం కు తగ్గించి రైతు జీవన ప్రమాణాలు మెరుగు, ఆదాయం రెట్టింపు నకు దోహద పడుతుంది అని, దేశ ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోడీ , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జీఎస్టీ తగ్గింపు లో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలలో ట్రాక్టర్ లు, టైర్లు, విడి భాగాలు, డ్రిప్ స్ప్రింక్లర్లు, డ్రోన్ లు, ఆక్వా కల్చర్ పరికరాలు, 12 రకాల బయోపెస్టిసైడ్ లు, పాల కాన్లు రేటులు తగ్గాయని తెలిపారు. అదే విధంగా సామాన్య ప్రజలకు కిరాణా సామాగ్రి పై 0 నుండి 5%, నిత్యవసర వస్తువులు 5%, ఆరోగ్య జీవిత భీమా పై సున్నా టాక్స్, దుస్తులు, పాద రక్షలు పై 5%, మందులు 12 నుండి 0/5% కు, ఏసీలు, టీవీల పై, చిన్న కార్లపై జీఎస్టీ రెట్లు తగ్గించి పేద మధ్య తరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ గా ఇచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుతానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వారితో పాటు, కే ఆర్ పురం సహాయ వ్యవసాయ సంచాలకులు పీజీ బుజ్జిబాబు, కుక్కునూరు మండల వ్యవసాయాధికారి ఆర్. బాలాజీ, మండల తహశీల్దార్ , పి. రమేష్, కుక్కునూరు ఎంపిడిఓ పి. నరసింహరావులతో పాటు మండల టీడీపీ అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరావు, మండల జనసేన అధ్యక్షుడు ములిశెట్టి యుగంధర్, మండల బిజెపి కోశాధికారి , లక్ష్మణాచార్యులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.