పాము కాటుకి ఆదివాసి మహిళ మృతి...విషాదంలో గ్రామస్తులు
అక్షర విజేత. వెంకటాపురం. (నూగురు )
వెంకటాపురం మండలం. తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కలిపాక గ్రామంలో బుధవారం వేకువ జామున మిడెం. లక్ష్మి నిద్రిస్తున్న సమయంలో కట్లపాము కాటు వేసింది. వెంటనే లక్ష్మి తనని ఏదో కరిసింది అని కుటుంబ సభ్యులకు తెలపడంతో ఆమెను వెంటనే వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వెంకటాపురం డ్యూటీ మెడికల్ ఆఫీసర్ నిర్ధారించారు. ఈ సంఘటనతో కలిపాక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి