కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం..మహిళల ఆర్థిక అభివృద్ధికి ఏర్పాటు చేసినది పరకాల ఇందిరా మహిళా డైరీ
అక్షర విజేత పరకాల ప్రతినిధి
ఝాన్సీ రాణి పట్టణ పరస్పర సహాయక సహకార సమాఖ్య లిమిటెడ్ ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి.బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 15 వ డివిజన్ పరిధి మొగిలిచెర్ల లోని మహాలక్ష్మి గార్డెన్ లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కు చెందిన ఝాన్సీ రాణి పట్టణ పరస్పర సహాయక సహకార సమాఖ్య లిమిటెడ్ ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథులుగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ,నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అంతకుముందు బతుకమ్మ, కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం అన్నారు.15,16,17 మూడు డివిజన్ ల పరిధి లో స్వయం ఉపాధికి అవకాశాలు ఇవ్వాలని సంకల్పించడం సంతోషదాయకం అని అన్నారు.మహిళా సంఘాల ఏర్పాటు అనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలోనే ఏర్పడినదని, అప్పటి నుండి మహిళా సంఘాలు ఆర్థిక రంగంలోనే కాకుండా సామాజిక రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చాయి అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి దామెరలో పరకాల ఇందిరా మహిళా డైరీ నీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.ప్రభుత్వ సహకారంతో అధికారుల కృషితో, రాజకీయాలకు అతీతంగా పరకాల డైరీనీ అభివృద్ధి చేసుకుందాం అని,ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.దేశ స్థితిగతులను మార్చే శక్తి మహిళా సంఘాలదేనని చెప్పడం అతిశయోక్తి కాదు అని, ప్రజా ప్రభుత్వ లక్ష్యం కోట్లాది మహిళలను ఆర్థికంగా బలపరిచి, వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం అన్నారు.సమాజం లో సామాజిక రుగ్మత లను రూపుమాపడానికి మహిళా సంఘాలు ఎంతగానో దోహదం చేస్తాయి అన్నారు.ఈ కార్యక్రమం లో డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య టి ఎం సి రమేష్ సి ఓ రజిత,సమాఖ్య అధ్యక్షురాలు మమత,తదితరులు పాల్గొన్నారు