అందరం కలిసుందాం.. హక్కులు సాధించుకున్నాం. టిడబ్ల్యూజేఎఫ్ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్. షాద్ నగర్ ఉర్దూ మీడియా జర్నలిస్టుల పిలుపు మహాసభలకు తరలిరావాలని ప
అందరం కలిసుందాం.. హక్కులు సాధించుకున్నాం.
టిడబ్ల్యూజేఎఫ్ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్.
షాద్ నగర్ ఉర్దూ మీడియా జర్నలిస్టుల పిలుపు
మహాసభలకు తరలిరావాలని పిలుపు
అక్షరవిజేత,షాద్నగర్ :
కందుకూరు మండలంలో శుక్రవారం పెద్ద ఎత్తున జరగనున్న రంగారెడ్డి జిల్లా టి డబ్ల్యూ జే ఎఫ్ మహాసభలను విజయవంతం చేయాలని షాద్ నగర్ ఉర్దూ దినపత్రికల సీనియర్ పాత్రికేయుడు, టిడబ్ల్యూజెఎఫ్ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ పిలుపునిచ్చారు. పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉర్దూ దినపత్రికల సీనియర్ పాత్రికేయులు అర్షద్, మొయిజ్, ఇక్బాల్, ఖాలేద్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ టిడబ్ల్యూజేఎఫ్ సారధ్యంలో జిల్లాలోని ఉర్దూ పాత్రికేయులు కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి పాత్రికేయులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులకు సంబంధించిన ఆరోగ్యకార్డులు, ప్లాట్లు, గుర్తింపు కార్డులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. పాత్రికేయులు అందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు కందుకూరు లో జరిగే జిల్లా మూడవ మహాసభలు విజయవంతం చేసేందుకు ప్రతి పాత్రికేయుడు ముందుకు రావాలని జిల్లాలో ఉన్న ఉర్దూ పాత్రికేయులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసూర్ అలీ ఖాన్ పిలుపునిచ్చారు.