మతిస్థిమితం లేని వ్యక్తి కనిపించడం లేదు
అక్షర విజేత ఉమ్మడి గోపాల్పేట్:
వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల పరిధిలోని బోయిని ఘట్టమ్మ, భర్త రాములు కు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి సంతానం కలరు అబ్బాయి పేరు బోయిని శివ (26) వృత్తి కార్ డ్రైవర్ శివ కి కొద్ది రోజుల నుంచి మతిస్థిమితం కలదు మతిస్థిమితం గురించి ట్రీట్మెంట్ చేర్చడం జరిగింది. కానీ సరిగ్గా కాలేదు 16-9-2025 రోజున రాత్రి సుమారుగా 10 గంటలకు ఇంట్లోంచి వెళ్లి తిరిగి రానందున గురువారం గోపాల్పేట పోలీస్ స్టేషన్ లో తల్లి బోయిని ఘట్టమ్మ ఫిర్యాదు మేరకు దరఖాస్తు చేసి ఇట్టి విషయం గురించి కేసు నమోదు చేయడం జరిగింది అని గోపాల్పేట ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.