బిఎన్ఐ అతిపెద్ద ఎం.ఎస్.ఎం.ఈ ఎక్స్పో
*బిఎన్ఐ అతిపెద్ద ఎం.ఎస్.ఎం.ఈ ఎక్స్పో*
అక్షర విజేత, హైదరాబాద్ బ్యూరో:
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార నెట్వర్కింగ్, వ్యాపార రిఫరల్ సంస్థ అయిన బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14వ తేదీల్లో శంషాబాద్ ఎస్ఎస్ కన్వెన్షన్ లో బిఎన్ఐ గోనాట్ 2025 పేరుతో ఎంఎస్ఎంఈ ఎక్స్పో నిర్వహిస్తున్నామని బిఎన్ఐ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షా తెలిపారు. బంజారా హిల్స్ తాజ్ డెక్కన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రెండు రోజుల ఈ ఉత్సాహాన్ని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని చెప్పారు. ఎమ్మెస్సీ మీ భవిష్యత్తు దేశ నిర్మాణంలో వాటి పాత్ర తెలంగాణ ప్రభుత్వం ఈ రంగాన్ని బలపరచడానికి తీసుకుంటున్న ప్రయత్నాలపై ఫైర్ సైడ్ చాట్లో పాల్గొననున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఎంఎస్ఎంఈ ఎక్స్పో, సెమినార్ ఇదేనన్నారు. 400 పరిశ్రమల్లో 4000 పైగా వ్యాపార యజమానులతో విస్తరించిన నెట్వర్క్ బిఎన్ఐ కే దక్కుతుంది. ఈ నగరంలో 13వ సంవత్సరం పూర్తి చేసుకుంటూ గొ నాట్ ఐదో ఎడిషన్ కు ఆహ్వానం పలుకుతుందన్నారు. భారతదేశం మరియు ఇతర దేశాల నుంచి 20వేలకు పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ బిఎన్ఐ గొ నాట్ 2025 స్థానిక వ్యాపారులను గ్లోబల్ స్టేజికి తీసుకెళ్లడానికి అనువైన వేదిక నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఏ హైదరాబాద్ ఏరియా డైరెక్టర్ టి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.