చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయండిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
– చొప్పదండి నియోజకవర్గం లోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే
– నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
అక్షరవిజేత,చొప్పదండి :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గం లోని పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను గురించి ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే సత్యం చర్చించారు.ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు.చొప్పదండి నియోజకవర్గం వరప్రదాయనిగా ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని చొప్పదండి నియోజకవర్గం లోని పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులకు సైతం నిధులు కేటాయించి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సత్యం కు హామీ ఇచ్చారు.చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించడానికి అనుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు