ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతోకాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి.. శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి
అక్షర విజేత దామెర/ హనుమకొండ
మంగళవారం దామర మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామాల వారిగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై అధికారులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే మంజూరు అయిన ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణ పనులు చేపట్టి త్వరగా పూర్తిచేసెలా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వారం రోజుల్లోగా ప్రారంభించకుంటే వారి మంజూరు ని రద్దు చేసి, అర్హత కలిగిన వారికి ఇస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం వహించవద్దని, ప్రభుత్వ నిబంధనల మేరకు ఇండ్లు నిర్మించుకొని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు గృహప్రవేశం చేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించేలా ప్రోత్సహించాలని అధికారులను కోరారు.