*30 న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయండి* *పేద విద్యార్థుల జీవితాలతో చేలగటమాడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
అక్షరవిజేత
, వికారాబాద్ ప్రతినిధి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నగర కేంద్రంలోని ఎస్ ఎఫ్ ఐ కార్యాలయం లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అక్బర్ మాట్లాడుతూ
ఈనెల 30వ తేదీన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు దొంగ హామీలు ఇచ్చి గద్దనెక్కారు అన్నా.రు గత రెండు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో 8,150 కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో చదివే విద్యార్థులకు సర్టిఫికెట్స్ తీసుకుందామంటే ప్రభుత్వం నుండి డబ్బులు రాలేదని విద్యా సంస్థల యజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు. గత నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, పిజి కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు రాష్ట్రంలో బంద్ కు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చలు జరిపి 1200 కోట్ల రూపాయలను రెండు దఫాలుగా విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్య రంగ సమస్యల పై , పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ను, ఫీజు రియంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు ,ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పీజీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు ప్రొఫెషనల్ కళాశాలలు, యూనివర్సిటీల బంద్ కు పిలుపునివ్వడం జరుగుతుందని,ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ బంద్ లో విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు రాకేష్ ,జునేద్,అఖిల్, సల్మాన్, రాజు,షోయబ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.