ఆర్యభట్ట హైస్కూల్లో విద్యార్థులచే ముందస్తు రక్షాబంధన్ ఉత్సవం
అక్షరవిజేత,జనగామ ప్రతినిధి :
జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఆర్యభట్ట హై స్కూల్లో నేడు విద్యార్థుల చేత రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకొని సోదరత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. రాఖీ పండుగ ద్వారా భారతీయ సంప్రదాయాలను, సోదరభావాన్ని బాల్యంలోనే బోధించాలనే ఉద్దేశ్యంతో స్కూల్ యాజమాన్యం ఈ వేడుకను ఏర్పాటు చేసింది.రాఖీ పండుగను శాంతి, ఐక్యత కి చిహ్నముగా జరుపుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బి.సురేష్‌చంద్ర ప్రిన్సిపాల్ బి.సృజన మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.