కరెంట్ షాక్ తో 8 గేదెలు మృతి ==గోపాల్పేట్ మండలం జయన్న తిరుమలపురం గ్రామంలో విషాదం ==తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్
అక్షర విజేత గోపాల్పేట్, రేవల్లి:
వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల పరిధిలోని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి సొంత గ్రామమైన జయన్న తిరుమలాపురం గ్రామంలో కరెంట్ షాక్ తో పూసల చెరువు దగ్గర ఆరు గేదెలకు మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు సుమారు 25 గేదలు మేత వేసుకుంటూ చెరువులో ఈత కొడుతూ వస్తుండగా 17 గేదెలు ఒడ్డు కు చేరుకోగా మిగతా 8 గేదెలు కరెంట్ షాక్ తో అక్కడికి అక్కడే చనిపోవడం జరిగింది. చనిపోయిన వాటిల్లో ఆరు గేదెలు ముద్దుల గోల్ల మల్లయ్య అలాగే రెండు గేదెలు బుజ్జుల భాస్కర్ రెడ్డికి సంబంధించినవి సుమారు ఒక్కొక్క గేదే లక్ష రూపాయలు ధర ఉంటుందని మొత్తం మీద ఎనిమిది లక్షలు నష్టం కలిగిందని రైతులు లబోదిబోమని విలపిస్తున్నారు. అదేవిధంగా చనిపోయిన గేదెలకు చిన్నచిన్న గేదె పిల్లలు ఉన్నాయని యజమానులు చెప్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి తమకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని వారు వేడుకుంటున్నారు.