మాజీ ఎమ్మెల్యే తప్పుడు ప్రచారాలను ఖండించిన అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మ రాంబాబు
మాజీ ఎమ్మెల్యే తప్పుడు ప్రచారాలను ఖండించిన అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మ రాంబాబు
అక్షరవిజేత,అశ్వారావుపేట :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే నారం వారి గూడెం కాలనీ పంచాయతీ లో బిఆర్ఎస్ నాయకులను బిఆర్ఎస్ లోకి చేర్చుకొని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు బిఆర్ఎస్ లోకి వచ్చినట్లు తప్పుడు వ్యాఖ్యలతో చేసిన. ఈ నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు. మీ మాటలు మోసపూరిత మాటలు అని గ్రహించారు. కాబట్టే మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు.అదే నారంవారిగూడెం కాలనీ లో హరుకులైన వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చాం. పామాయిల్ ఫ్యాక్టరీలకు విద్యుత్ మా ప్రభుత్వంలో ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు. అసలు ఆ ఫ్యాక్టరీలు తీసుకొచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. హయాంలో జలగం వెంకట్రావు. నాయకత్వంలో పామల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది.మీ ప్రభుత్వంలో దళిత బంధు పేరుతో కమిషన్లు దోచుకొని ఇలాంటి ఎన్నో అక్రమాలు చేశారు. మీ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో కనీసం ఒక్కరికైనా రేషన్ కార్డులు ఇచ్చారా? మా ప్రభుత్వం 18 నెలలోనే ప్రతి ఒక కుటుంబానికి రేషన్ అందిస్తున్నాము .ఇలా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తున్నాం.గత పది సంవత్సరాల్లో పేద ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన మీకు రాలేదు.మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందిస్తూ ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం.మేము రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చక్కటి పరిపాలన అందుస్తున్నాం. మీరు మీ తప్పుడు ప్రచారాలు వల్ల మోసపూరిత మాటలతో ప్రజలని నమ్మించాలని చూస్తే స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది.మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ ,పేద ప్రజలు బడుగు బలహీనవర్గాలు బీసీలు ఎస్టీ ఎస్సీలు అండదండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు మీ ప్రభుత్వం పది సంవత్సరాలు చెయ్యలేనటువంటి అభివృద్ధి మా ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిఎమ్మెల్యే జారే ఆదినారాయణ 18 నెలలో ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని చక్కటి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.మీరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో. సొసైటీ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ. నండ్రు రమేష్.అశ్వారావుపేట మాజీ ఎంపిటిసి వేముల భారతి ప్రతాప్. గేదల సురేష్ నాయుడు. నారం కృష్ణ. పేరం నాగబాబు.నారంవారిగూడెం కాలనీ గ్రామస్తులు, పార్టీ నాయకులు, అశ్వరావుపేట మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు.