నీటిపై నిద్ర! అబ్బురపరుస్తున్న యువకుడి విన్యాసం
నీటిపై నిద్ర! అబ్బురపరుస్తున్న యువకుడి విన్యాసం
విజేత,తరిగొప్పుల:
సాధారణంగా మనుషులు నీటిలో ఈదడం చూస్తుంటాం. కానీ, ఒక యువకుడు మాత్రం నీటిపై పరుపు మీద పడుకున్నట్లుగా ఎంతో హాయిగా తేలుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఎటువంటి ఆధారం లేకుండా, గంటల తరబడి నీటిపై స్థిరంగా ఉండగలిగే అతని ప్రతిభ ఇప్పుడు మండలంలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే తరిగొప్పుల మండల కేంద్రంనికి చెందిన చిలివేరు మధు అనే యువకుడు గంటల తరబడి నీటిపై తేలుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.సాధారణంగా నీటిలో శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. కొంచెం పట్టు తప్పినా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ యువకుడు మాత్రం ఒక అద్భుత విద్యను ప్రదర్శిస్తున్నాడు. చెరువులు, కుంటలు లేదా స్విమ్మింగ్ పూల్స్‌లో అతను వెల్లకిలా పడుకుని, కదలకుండా అలానే ఉండిపోతాడు. నీటిపై తేలడం అనేది కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, అది శ్వాస మీద నియంత్రణ మరియు ఏకాగ్రతతో కూడిన విద్య.అని ఆ యువకుడు పేర్కొన్నాడు. దీనిని చూసిన గ్రామస్తులు ఇతను మనిషా లేక జలకన్య మగ రూపమా?" అని కొందరు సరదాగా కామెంట్ చేస్తుంటే, మరికొందరు అతని ఏకాగ్రతను మెచ్చుకుంటున్నారు. సరైన శిక్షణ, పట్టుదల ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఈ యువకుడు నిరూపిస్తున్నాడు.