అక్షర విజేత ఎఫెక్ట్ ==24 గంటల్లో పని పూర్తి చేసిన రేవల్లి మండల విద్యుత్ అధికారి శ్రీశైలం ==పడిపోతే ప్రమాదమే అనే కథనానికి స్పందన
అక్షర విజేత గోపాల్పేట్, రేవల్లి:
వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రం నుండి కుంకలపల్లి గ్రామం మధ్యగల సరిహద్దున ఓ విద్యుత్ స్తంభం అకాల వర్షానికి కురిసిన కారణంగా ఓవైపు ఒరిగి ఉండి ప్రమాదకరంగా ఉన్నది. ఈ దృశ్యాన్ని జాతీయ దినపత్రిక అక్షర విజేత శుక్రవారం ప్రచురించడం జరిగింది. ఈ కథనానికి రేవల్లి మండల విద్యుత్ అధికారి శ్రీశైలం వెంటనే స్పందించి 24 గంటల్లో ఆ స్తంభాన్ని యధావిధిగా అమర్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.