పార్టీ కార్యకర్తకు అండగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మొగతడకల ఓం ప్రకాష్
అక్షర విజేత ద్వారకాతిరుమల
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో ఇటీవల కాలంలో యాదవ కళ్యాణ మండపం వద్ద జరిగిన బైక్ యాక్సిడెంట్లో వారకాతిరుమల గ్రామ నివాసితుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన బాల భద్ర బాల బాలాజీ శ్రీనివాస్ అకాల మరణాన్ని చింతిస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించిన ద్వారకాతిరుమల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఓం ప్రకాష్ అప్పుడు వారి పిల్లల భవిష్యత్తుకు చదువుకు అవసరమైన బాధ్యతను తీసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి ఆ ఇచ్చిన మాట ప్రకారం వారిద్దరి కుమారులను శ్రీ శ్రీనివాస మోడరన్ స్కూల్లో పెద్ద కుమారుడు బాల భద్ర సాయి మనోజ్ కి పదో తరగతి రెండవ కుమారుడు బాలబద్ర శివ నాగ ప్రవీణ్ కు 8వ తరగతికి సంబంధించి వారి స్కూల్ ఫీజు అయిన అక్షరాల 68 వేల రూపాయలు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అయినా దావులూరి ప్రభాకర్ కు చెక్కు రూపేనా అందించడం జరిగింది. ఆపదలో ఉన్నాను అంటే వెంటనే సహాయం చేయడానికి ముందు ఉండే ఓం ప్రకాష్ కు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు