*వైన్స్ షాపు ఏర్పాటు చేయొద్దంటూ మహిళలు ఆందోళన*
*అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-*
జనావాసాల్లో వైన్స్ షాపు ఏర్పాటు చేయొద్దంటూ సోమవారం రెబ్బెన మండలంలోని గోలేటిలో మహిళలు ఆందోళనకు దిగారు నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైన్స్ షాపు ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు జనావాసాల మధ్య షాపు ఏర్పాటు చేయడం వల్ల తాము తన పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్సెజ్ అధికారులు స్పందించి వైన్స్ షాపును జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నిన్న ఇదే తరహాలో కాగజ్ నగర్ మండలంలోని ఈస్లాంలో వైన్స్ షాపు ఎత్తివేయాలని ఆందోళన చేయగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు ఇచ్చారు